Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకేటీఆర్ సమక్షంలో 25న బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

కేటీఆర్ సమక్షంలో 25న బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ లకు షాక్
గులాబీ తీర్థం పుచ్చుకోనున్న బీజేపీ నేత విజయభారతి
త్వరలో బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున వలసలు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ భవన్ లో ఈ నెల 25న జరగనున్న కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి భారీగా చేరనున్నా రని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం కేటీఆర్ ను కలిసి ఈ చేరికల కార్యాక్రమాన్ని ఖరారు చేసుకున్నామని ఆయన అన్నారు.నిజామాబాద్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ లకు భారీ షాక్ ఇచ్చేలా ఈ చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. బీజేపీ  స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు  విజయభారతి, ఆమె అనుచరులు  కేటీఆర్ సమక్షంలో  పార్టీలో చేరనున్నారని ఆయన చెప్పారు. విజయభారతి భర్త అరవింద్ గతంలో గ్రేటర్ హైదరాబాద్ లోని ఆర్ కే పురం డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.కాగా త్వరలో కాంగ్రెస్, బీజేపీ ల నుంచి  బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad