జయపద్రం చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ, ఈనెల 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘యుద్ధ వ్యతిరేక ప్రజా-కార్మిక ప్రదర్శన’ను జయప్రదం చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. ఈ భారీ ర్యాలీ చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు కొనసాగనుంది. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు సమావేశమయ్యారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐక్యరాజ్యసమితిని సైతం లెక్కచేయకుండా సామ్రాజ్యవాద అమెరికా దుర్మార్గాలకు పాల్పడుతోందని, వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం దీనికి నిదర్శనమని విమర్శించారు. భారత ప్రభుత్వం అలీన విధానాన్ని విస్మరించి, ఇజ్రాయిల్‌కు మద్దతు తెలపడం ద్వారా దేశంలో గ్యాస్ ధరల పెరుగుదల, ఇతర ఆర్థిక సంక్షోభాలకు కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ.. ఆయిల్ నిక్షేపాలపై పట్టు సాధించేందుకే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధానికి దిగాయని విమర్శించారు. ట్రంప్, నేతన్యాహు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారని, వారి సొంత దేశాల్లోనే ఈ యుద్ధంపై వ్యతిరేకత ఉందని తెలిపారు. ఈ యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, శాంతిని కోరుకునే గొంతుకను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎన్టీ యూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డి.చంద్రశేఖర్, ఏఐటీయూసీ నగర కార్యదర్శి కె.యాదగిరి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, నగర అధ్యక్షకార్యదర్శులు ఎం.దశరథ్, జె.కుమారస్వామి, టీయూసీఐ నగర కార్యదర్శి ప్రదీప్, బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు మారయ్య, సీఐటీయూ హైదరాబాద్ సౌత్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు మీనా, శ్రావణ్, నాయకులు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
యుద్ధానికి వ్యతిరేకంగా 29న నగరంలో భారీ ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



