నవతెలంగాణ – మద్నూర్
సమకాలీన సమస్యలకు గణితమే మూలమని- ప్రిన్సిపాల్ సుధాకర్, ప్రముఖ పద్యకవి,సహాయ ప్రిన్సిపాల్ డా బి.వెంకట్ కవి తెలిపారు. గణితోపాధ్యాయులు-బచ్చు సుమన్, రాజప్ప, హనుమాన్లు లు పేర్కొన్నారు. తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రామానుజన్ చిత్రపటానికి పూలమాలలను వేశారు. విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గేయాలు, గణితంపై ఉపన్యాసాలు సభను అలరించాయి.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుధాకర్ మాట్లాడుతూ.. గణితముపై శ్రద్ధ పెట్టాలి,అన్ని అభ్యాసాలు పూర్తి చేయాలన్నారు. ప్రముఖపద్యకవి డా బి.వెంకట్ కవి మాట్లాడుతూ .. మన జీవితానికి గణితమే శాశ్వతమైనదని అన్నారు. ప్రతి వ్యక్తికి గణితము చాలా ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీనివాస రామానుజన్ గణిత సూత్రాలను అందరూ సాధన చేయాలన్నారు. గణితోపాధ్యాయులు సుమన్, రాచప్ప, హన్మాండ్లు మాట్లాడుతూ .. విద్యార్థులు గణితమును ఏకాగ్రతతో చదవాలన్నారు. మానవిజీవతమునకు గణితమునకు దగ్గరి సంబంధం ఉంటుందని అన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్, ప్రముఖ పద్యకవి డా బి.వెంకట్కవి, ఉపాధ్యాయులు వేణుగోపాల్, సంతోష్, సుమన్, రాజప్ప, హన్మాండ్లు, నరహరి, పి.శంకర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




