హెల్త్ ఎడ్యుకేటర్లు, మీడియా ఆఫీసర్ల.. డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న వైద్యసేవలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని హెల్త్ ఎడ్యుకేటర్లు, మీడియా ఆఫీసర్లకు మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ హెల్త్ ఎడ్యుకేషన్, మీడియా ఆఫీసర్స్ ఆసోసియేషన్ అధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెరుగైన సేవలందిస్తున్న హెల్త్ ఎడ్యుకేటర్లను అభినందించారు.ఉద్యోగులు శాఖ పరమైన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని మంత్రి హామీనిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు కొప్పు ప్రసాద్, జక్కుల రాములు, వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాసులు, ఎం.శ్రీనివాస్, రేష్మ, కటుకం శంకర్ , జె.శ్రీనివాసులు, శ్రీనివాసరావు, పుష్ప, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.



