నవతెలంగాణ – తిమ్మాజీపేట
మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థనారి శక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా కేంద్రం నుండి వచ్చిన డెర్మటాలజీ డాక్టర్ వివేక్ చర్మానికి సంబంధించిన రోగాలను గుర్తించి వైద్య చికిత్సలు నిర్వహించరు. ఈ సందర్భంగా 60 మంది మహిళలకు చికిత్సలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ మెడికల్ క్యాంపు అక్టోబర్ రెండో వరకు ఉంటుందని ఒక్కొక్క వారం ఒక స్పెషాలిటీ డాక్టర్ వచ్చి చికిత్సలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మా, డాక్టర్ ఇస్మాయిల్, ఫార్మసీ ఆఫీసర్ డి బాలరాజు రోజులిన్ నర్సింగ్ ఆఫీసర్ రోజ్లిన్ ఆయుష్ ఫార్మసిస్ట్ సరళ పిహెచ్ఎన్ రాణి డిపిఎమ్ఓ వెంకటయ్య ఏఎన్ఎం సాలెహ యాదయ్య ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలకు వైద్య పరీక్షలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES