Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్‌కు మేడిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు

కలెక్టర్‌కు మేడిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు

- Advertisement -

ఎమ్మార్వో, ఆర్‌ఐలను సస్పెండ్ చేయాలి
నవతెలంగాణ – చిన్నకోడూరు

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా ఎమ్మార్వో,ఆర్ ఐలను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ టి.డి.పి.ఎస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మేడిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 96 గత 50 ఏళ్లుగా ప్రస్తుత ‘భూభారతి’ రికార్డుల్లోనూ నిషేధిత జాబితాలో ఉంది.

 నిషేధిత జాబితాలో ఉన్న ఈ ప్రభుత్వ భూములను, చిన్నకోడూరు ఎమ్మార్వో, ఆర్‌ఐలు తప్పుడు రిపోర్టులు సృష్టించి పట్టా భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

 దీనిపై గతంలో ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుపై కలెక్టర్ , స్పందించిసదరు సర్వే నంబర్ 96ను వెంటనే నిషేధిత జాబితాలోనే కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను కాపాడాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -