- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ -ఈహెచ్‌సీటీ) బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశం రేపు జరగనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఛాంబర్ లో సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగులకు కొత్తగా ఆరోగ్య పథకం అమలు విధానాలపై చర్చిస్తారు. ప్రభుత్వానికి అవసరమైన సిఫారసులను చేసేందుకు బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశమవుతున్న సంగతి తెలిసిందే.
- Advertisement -



