నవతెలంగాణ – మద్నూర్
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రఖ్యాతగాంచిన మూడు రాష్ట్రాల సరిహద్దులోని మద్నూర్ మండలం సలాబత్పూర్ ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 2న జరగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేపట్టడానికి మందిరావరణంలో శుక్రవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధికారి వేణు కమల, మద్నూర్ మండల దెగులూరు పట్టణానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భక్తుల క్యూ లైన్ లకు అలాగే అన్నదానం కోసం మందిరానికి కలర్లు వేయడానికి రకరకాల ఏర్పాట్లపై చర్చించి పనులు చేపట్టడానికి మాట్లాడారు. ఈనెల 26 నుండి ఏప్రిల్ 2 వరకు ఆలయ ఆవరణంలో ప్రత్యేక పూజలు సప్త కార్యక్రమం ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారి వేణు తెలిపారు. ఈ ప్రత్యేక సమావేశంలో సలాబత్పూర్ గ్రామ సర్పంచ్ దిగంబర్ ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
ఆంజనేయస్వామి ఉత్సవ ఏర్పాట్లపై సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



