నవతెలంగాణ – ఆర్మూర్
భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి ఎర్ర జొన్నలపై బుధవారం పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎర్ర జొన్న పంట డివిజన్ ప్రాంతంలోనే పండుతోంది ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రైతాంగం ఎర్ర జొన్న సాగు విస్తీర్ణం గతంలో సుమారు48 వేల ఎకరాల వరకు ఎర్రజొన్న సాగు చేస్తా ఉంటిమి అని అన్నారు.
కానీ కాలకమైన మొక్కజొన్న వైపు పోతూ రైతాంగం ఎర్ర జొన్న ఈ సంవత్సరం చాలా తగ్గించి సుమారు 22,000 ఎకరాలు విస్తీర్ణం అయినా రైతులకు నాలుగు నుంచి ఐదు వేల వరకు మద్దతు ధర వస్తుందని ఆశించడం జరిగింది. కానీ ఎర్ర జొన్న వ్యాపారస్తులు సిండికేట్ అయి రైతాంగానికి ఈరోజుకు 3300 రూపాయలకు తగ్గించి కొనుగోలు చేస్తా ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఎర్రజొన్న పంట డిమాండ్ ఉన్న ఎక్స్పోర్ట్ పేరు మీద వ్యాపారస్తులు రైతుల్ని నిండా ముంచుతా ఉన్నా ఇక్కడున్నటువంటి అధికారులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇప్పటివరకు ఈ యొక్క ఎర్రజను రైతులపై పట్టించుకోకపోవడం శోచనీయమని ఖండించాడు.
ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రైతాంగానికి ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు 4,500 వరకు ఇప్పించే విధంగా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేకుంటే గతంలో ఎర్ర జొన్న పంటపై ఉద్యమాలు చేస్తామని మళ్లీ రానున్న రోజుల్లో భారతీయ జనతా కిసాన్ మోర్చా మద్దతు ధర వచ్చేంతవరకు ఉద్యమాలు చేపడుతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందుల బాలు, బిజెపి పట్టణ అధ్యక్షులు రైతు నాయకులు చిట్టి భజన ,రైతులు నారాయణ నరేష్ తదితరులు పాల్గొన్నారు.



