Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తికి ఘననివాళ్లు

మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తికి ఘననివాళ్లు

- Advertisement -

పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తి పురిటిపాటి విజయలక్ష్మికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నెల 5న విజయలక్ష్మి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె సంస్మరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగింది.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు జి కిషన్‌ రెడ్డి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బండి సంజయ్, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉప సభాపతి ఆర్‌ రఘురామకృష్ణంరాజు, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, ఎంపీలు సీఎం రమేష్‌, కే.రఘువీర్‌రెడ్డి, డీకె అరుణ, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌, సినీ నటులు కొణిదెల చిరంజీవి, దగ్గుబాటి వెంకటేష్‌, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఏపీ జితేందర్‌ రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, తెలంగాణ హౌమ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి సీవీ ఆనంద్‌, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, మై హౌమ్‌ గ్రూప్‌ సంస్థల చైర్మెన్‌ జూపల్లి రామేశ్వరరావు, వైఎస్‌ఆర్‌ సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, టీడీపీ నేత జేసీ పవన్‌ రెడ్డి తదితర ప్రముఖులు విజయలక్ష్మికి నివాళులర్పించారు. ఎంఈఐఎల్‌ సీఈఓ పీవీ సుబ్బారెడ్డి, కుమార్తె ప్రసన్న, సోదరుడు పీపీరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ రంగాలకు చెందిన అధికార, అనధికార ప్రముఖులు మేఘా సంస్థ అధికారులు, సిబ్బంది విజయలక్ష్మికి నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -