Thursday, November 6, 2025
E-PAPER
Homeదర్వాజ'మనుషులము అలా మనలేమ'

‘మనుషులము అలా మనలేమ’

- Advertisement -

అడవులకు కూడా ఒక నడవడి ఉంటుందని విన్నాను.
సింహం కడుపు నిండితే దాడి చేయదని విన్నాను,
అడవి చెట్ల దట్ట నీడలో పడుకుంటుందని విన్నాను.
గాలి ప్రచండంగా వీచి చెట్లను ఆడించినప్పుడు,
మైనా తన పిల్లలను వదిలేసి,
కాకి గుడ్లను తన రెక్కలతో కప్పుతుందని విన్నాను.
గూడు నుండి ఏ పిల్లవాడు పడిపోతే,
మొత్తం అడవి మేల్కొనిపోతుందని విన్నాను.
ఏ నది నీటిలో,
బావి గూడు యొక్క సువాసన రంగు తూగుతూ ఉంటే,
నది వెండి మత్స్యాలు దాన్ని పొరుగువాడిగా భావిస్తాయని విన్నాను.
ఎప్పుడైనా తుఫాను వస్తే, ఏ వంతెన ఊడిపడితే,
ఒక కొయ్య తలుపుపై,
ఉడుత, పాము, మేక, చిరుత పులి కలిసి ఉంటారని విన్నాను.
అడవులకు కూడా ఒక నడవడి ఉంటుందని విన్నాను.
ఓ ప్రభూ! గొప్పవాడా! దయామయుడా! న్యాయమూర్తీ! మహానుభావా!
ఈ నా నగరంలో ఇక అడవుల నియమమే నడుస్తుండుగాక!
– నజీర్‌ అహ్మద్‌, 8500443170

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -