జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి
నవతెలంగాణ – కాటారం: సూక్ష్మ, చిన్న, మధ్యతరహ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలను సృష్టిస్తాయని, పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తాయని అన్నారు. పరిశ్రమల స్థాపనకు యువతీ, యువకులు ముందుకు రావాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి కోరారు. మంగళవారం కాటారం మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మండలంలోని నిరుద్యోగ యువతకు పరిశ్రమల స్థాపన రుణాల పంపిణీ తదితర అంశాలపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువత నిరుద్యోగంతో నిరాశ పడకుండా, ఉపాధి మార్గాలను ఎంచుకొని జీవితాలను మార్గదర్శకంగా మలుచుకోవాలని అన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొంది, సబ్సిడీ లాంటి వివరాలతో తగిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో అడ్డూరి బాబు మాట్లాడుతూ యువత ఉపాధి అవకాశాలతో, సేవ భావంతో, కుటుంబ పోషణ, సమాజ నిర్మాణంలో భాగంగా చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు సంకల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో డిస్టిక్ జయశంకర్ భూపాలపల్లి మేనేజర్ అత్కూరి వెన్నల, జాడి నరేందర్ అసిస్టెంట్ మేనేజర్, బెజ్జల రాజశేఖర్, ఏ తిరుపతి లీడ్ బ్యాంకు మేనేజర్ భూపాలపల్లి తదితరులు పాల్గొన్నారు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



