Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలు రైతు పేరు తో "దళారుల దందా"..

కౌలు రైతు పేరు తో “దళారుల దందా”..

- Advertisement -

దళారులు, అధికారుల ములాకత్ తో దగపడుతున్న రైతులు
నవతెలంగాణ – కాటారం
:జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని కాటారం మండలంలో దళారులు, వ్యవసాయ శాఖలోని కిందిస్థాయి సిబ్బందితో ములాకత్ అయ్యి దళారీ వ్యవస్థకు దారి తీశారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పత్తిని దళారులు తక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ అమాయక రైతులని మోసం చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొంతమంది వ్యవసాయ శాఖ లోని కిందిస్థాయి సిబ్బంది దళారులకు సహకరిస్తూ కౌలు రైతు అవతారం ఎతుతున్నారు. దళారులతో కుమ్మక్కై తులాభారం తలపిడికెడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల దృష్టి మందగించడంతో కిందిస్థాయి సిబ్బంది అమ్మమ్యాలకు అలవాటు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతన్నకు కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే మధ్యలో దళారులు, వ్యవసాయ శాఖ కిందిస్థాయి సిబ్బంది సహాయంతో దండుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలు రైతులు కోరుతున్నారు.

దళారులకు సహకరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి: ఆత్కూరి శ్రీకాంత్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి
ఫేకు కౌలు రైతు రిజిస్ట్రేషన్ చేస్తూ వ్యవసాయ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులను వెంటనే పై అధికారులు స్పందించి దళారుల వ్యవస్థకు సహాయపడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -