Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅంగన్వాడీల హక్కుల కోసం సమర శీల పోరాటాలు

అంగన్వాడీల హక్కుల కోసం సమర శీల పోరాటాలు

- Advertisement -
  • – అంగన్వాడి ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలి
    – అంగన్వాడి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి
    – ప్రారంభమైన అంగన్వాడీ యూనియన్ జిల్లా మహాసభలు
    నవతెలంగాణ- మెదక్ డెస్క్ :
    అంగన్వాడీల హక్కుల సాధన కోసం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ ) ఆధ్వర్యంలో అనేక సమరశీల పోరాటాలు నిర్వహించామని అంగన్వాడీ, ఉద్యోగులకు పర్మినెంట్ చేసి, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అంగన్వాడీ యూనియన్ జిల్లా 5 వ మహాసభలను మహాసభలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విధాన విద్యా విధానంచట్టాన్ని తెచ్చిందన్నారు.
  • ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిఫార్సులను అమలు చేస్తుందని, ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేయడానికి నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గకరమన్నారు. ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు విద్యాశాఖకు అప్పగించడం సరైంది కాదని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణ వెనక్కి తీసుకొని ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ కి, హెల్పర్స్ ఇవ్వాలని, వాలంటీర్లకిచ్చే అదనపు వేతనం అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలని, టీచర్ హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
  • అంగన్వాడి ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం ప్రభుత్వం పెంచిన వయోపరిమితిని 60 సంవత్సరాలకు కుదించాలని, రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ టీచర్స్ కు రూ.10 లక్షలు, ఆయాలకు రూ.5 లక్షలు, మట్టి ఖర్చులకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పీఫ్, ఈ ఎస్ఐతో పాటు ప్రమాద భీమా రూ.20 లక్షలు ఇవ్వాలని, అర్హులైన ఆయాలను టీచర్స్ గా ప్రమోట్ చేయాలన్నారు. ఈ మహాసభల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, అంగన్వాడీ యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శి పి.మంగ, శశికళ, కోశాధికారి ఏసుమణి, అంగన్వాడి యూనియన్ నాయకురాలు అరుణ, విజయ, ఇందిర, యేసుమని, కవిత, గౌరమ్మ, విజయ, స్వరూప, అనురాధ, జమున, భ్రమరాంభ, బాలమణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad