Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్సీఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం..

సీఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం..

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ రూరల్  : తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ప్రజల్లో విశేష స్పందన వ్యక్తమవుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ శనివారం వేములవాడ అర్బన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. నంది కమాన్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం జరిపారు.

ముఖ్యఅతిథిగా హాజరైన వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు న్యాత నవీన్ మాట్లాడుతూ .. “బీసీలకు న్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ నిర్ణయాన్ని గ్రామగ్రామాన ప్రజలకు తెలియజేసే బాధ్యత మనదేన్నారు. అందుకు పార్టీ తరఫున కార్యాచరణ చేపడతాం,” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వేములవాడ అర్బన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొమ్మ తిరుపతి, మాజీ సర్పంచ్ పండుగ ప్రదీప్, నాయకులు స్వామి, ఇర్ఫాన్, సునీల్, కాసార్ల అరుణ్ కుమార్, గాలిపెల్లి బాబు, శ్యమల రమేష్, బాణాల రాజు, భారత్, అభిలాష్, అరుణ్, మద్దెల నవీన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad