Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్లడిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

కల్లడిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
ఆలూర్ మండలం కల్లడి గ్రామంలో జిల్లా డీసీసీ సెక్రటరీ డేగ పోశెటి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్,  నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ల చిత్రపటాలకు బుధవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డేగ పోశెటి మాట్లాడుతూ .. ఎస్‌డీఎఫ్ నిధుల ద్వారా పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.30 లక్షలు, 60 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనందుకు, సీసీ రోడ్ల నిర్మాణం, మైనార్టీ భవన నిర్మాణానికి, బస్సు షెల్టర్ కోసం నిధులు మంజూరు చేయించిన వినయ్ రెడ్డికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కల్లడి గ్రామ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు  తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నిలగిరి శ్రీనివాస్, సిరికొండ మహేష్, బండారి రమేష్, కృష్ణ, యోహాన్ రవి, గంగారాం, గంగాధర్, బాలరాజ్, శ్రీను, శివ, అరవింద్, సంతోష్, సురేష్ గౌడ్, రాజు, ధర్మయ్య, భాస్కర్, నర్సరెడ్డి, లీగరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -