– ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష
నవతెలంగాణ – ముధోల్ : బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని పర్యాటక, సాంస్కృతిక శాఖ ,జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ నంతరం ఇటీవల చోరీ జరిగిన మహంకాళి అమ్మవారి ఆలయాన్ని మంత్రి సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు ఇంద్రప్రస్థ గెస్ట్ హౌస్ లో బాసర ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి, ఆలయ ఈవో అంజనాదేవితో మంత్రి సమీక్ష నిర్వహించారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, బాసర సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, నాయకులు బాశెట్టి రాజన్న, లక్ష్మణ్ రావు, సుధాకర్ రెడ్డి, సంజీవ్ రావు, పోతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



