నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ కు గుండెపోటు రావడంతో అతన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రిలో పరామర్శించారు. నాగుల సత్యనారాయణ గుండెపోటుకు గురికాగా హైదరాబాదులోని కేర్ హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆసుపత్రికి తరలి వెళ్లి నాగుల సత్యనారాయణ ఆరోగ్యం విషయంపై వైద్యులతో చర్చించాడు. తదుపరి ఐసీయూలోకి వెళ్లి నాగుల సత్యనారాయణ ను పరామర్శించాడు. నాగుల సత్యనారాయణ గౌడ్ త్వరగా కోలుకోవాలని మళ్లీ యధావిధిగా రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. నాగుల సత్యనారాయణ గౌడ్ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ధైర్యం చెప్పారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు మంత్రి పొన్నం పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES