Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు ల జోలికి వస్తే సహించేది లేదు

మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు ల జోలికి వస్తే సహించేది లేదు

- Advertisement -

– కామారెడ్డి  ఆదివాసి కాంగ్రెస్ పార్టీ 
నవతెలంగాణ –  కామారెడ్డి

రాష్ట్ర మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు ల జోలికి వస్తే  సహించేది లేదనీ కామారెడ్డి ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివాసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన  విలేకరుల సమావేశం లో  కామారెడ్డి జిల్లా ఆదివాసి కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ మాట్లాడుతూ సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు , పినపాక ఎమ్మెల్యే  , భద్రాచలం ఎమ్మెల్యే  తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని కలిసి ఉట్నూర్ ఐటీడీఏ , భద్రాచలం ఐటిడిఏ సంబంధించిన బీ.ఈడీ కాలేజీ స్టాఫ్ భర్తీ చేయాలని, నిధులు  కేటాయించాలని,  ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన భవన సౌకర్యాలు అదనంగా కేటాయించి వాటికి నిధులు కేటాయించాలని చెప్పేసి గత కొద్దిరోజుల క్రితం వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ విషయం పక్కనబెట్టి బంజారాలను ఎస్టి నుండి తొలగించాలని చెప్పేసి ఫేక్ ఫోటో పెట్టి మంత్రి సీతక్క ని , ఎమ్మెల్యే ఎడమ బొజ్జూ ని బద్నాం చేసే కుట్ర పన్నడం సరైన పద్ధతి కాదు అని వారు హెచ్చరించారు. దీని వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉందని ఆర్ఎస్ఎస్, బిజెపి, బిఆర్ఎస్ పనుతున్న కుట్ర అని అన్నారు. వారు వారి యొక్క ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని  విమర్శించినారు. గత ప్రభుత్వంలో కెసిఆర్  ఇలాగే డబ్బులు ఇచ్చి బంజారా, గోండు,కోయ తెగల మధ్య చిచ్చు బెట్టి రాష్ట్ర మొత్తం గందరగోళం సృష్టించినాడన్నారు.  అదే బాటలో బిజెపి, ఆర్ఎస్ఎస్, బీఆర్ఎస్  ఇప్పుడు కూడా గొడవలు సృష్టించి మమ్మల్ని విడదీసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్నారు. అన్నదమ్ములుగా  కలిసిమెలిసి  ఉన్నప్పుడు ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేసి మమ్మల్ని విడదీసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్నారు.

మాకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ  ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో  మమ్మల్ని గుర్తించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బంజారాలు గాని , గోండు ,కోయాలు గాని, ఆదివాసి బిడ్డలు ప్రశాంతంగా బతుకుతున్నారన్నారు. వనవాసి పేరుమీద బిజెపి ,ఆర్ఎస్ఎస్  చేస్తున్న కుట్రలు తిప్పి కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా వారు ఆదివాసి బిడ్డలకు కోరారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎవరైతే దుష్ప్రచారం చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలని  నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గణపతి జాదవ్, ప్రేమ్ కుమార్ జాదవ్, కేలూత్ రాజం నాయక్, శంకర్ నాయక్, సురేందర్ నాయక్, హలవత్ కిషన్ నాయక్, రవి నాయక్, భుఖ్య నరహరి నాయక్, అజ్మీర ప్రవీణ్ నాయక్, మాలోత్ తిరుపతి నాయక్, కేలూత్ మైపాల్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad