- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్ది నవీన్ యాదవ్ తో కలసి మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం కాంగ్రెస్ కార్యకర్తలకు అల్పహరం వడ్డించి వారితో కలిసి బోరబండలో ప్రచారం ప్రారంభించారు. కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ అభ్యర్ది నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి సీతక్క చేశారు. BRSకు 3 సార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదని, జూబ్లీహిల్స్ అభివృద్ది జరగాలంటే కాంగ్రెస్ గెలవాలని సీతక్క సూచించారు.
- Advertisement -