నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదివారం జిల్లా కేంద్రం నుంచి మంథనికి వెళుతున్న నేపథ్యంలో మార్గమధ్యంలో మండలంలోని రుద్రారం నుంచి కొయ్యుర్ వరకు రూ.20 కోట్లతో నిర్మాణం చేపట్టిన డబుల్ రోడ్డు అభివృద్ధి పనులు పరిశీలించారు. అడుగగానే డబుల్ రోడ్డు మంజూరు చేసి నిర్మాణ పనులు త్వరగా అయ్యేలా చెసిన మంత్రికి రుద్రారం గ్రామస్తులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి వళ్లెంకుంట గ్రామంలో పలువురు మృతుల కుటుంబాలను పరమార్షించి,ప్రగాఢ సానుభూతి ప్రకటించి,మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య తోపాటు పలువురు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES