Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకేంద్రమంత్రి కుమారస్వామిని కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

కేంద్రమంత్రి కుమారస్వామిని కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : తెలంగాణలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర పారిశ్రామిక మంత్రి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామిని కలిసి ఆ మేరకు వినతి పత్రం సమర్పించారు. ‘పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ద్వారా జాతీయ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి గణనీయంగా దోహదపడాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ఈ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణపై దృష్టి సారించాం. పెద్దపల్లిలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్ సీఎల్) విజయవంతంగా నడుస్తోంది.

ఇదే మాదిరిగా ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలోని స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఐఎల్)ను పునరుద్ధరిస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికాభివృద్ధికి మేలు జరుగుతుంది. స్థానిక ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ‘మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కుమార స్వామి సానుకూలంగా స్పందించారు. ఆ రెండు పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు’ అని మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad