Friday, June 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేడు తాడిచర్లలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన.!

నేడు తాడిచర్లలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచర్లలో నేడు శుక్రవారం రాష్ట్ర ఐటీ,పరిశ్రమల  శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించనున్నట్లుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా అబ్జర్వర్ లింగాజి లు పాల్గొననున్నట్లుగా తెలిపారు.ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,మండల యూత్,మహిళ,గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు,  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -