కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య..
నవతెలంగాణ – మల్హర్ రావు
రేపు ఆదివారం మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పర్యటించనున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుదురుపల్లి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్నీ ఏఎస్ఆర్ పంక్షన్ హాల్లో మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. కాటారం, మహా ముత్తారం, మహా దేవపూర్, మలహర్రావు, పలిమెల మండల సంబంధించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ బిఎల్ఎం గార్డెన్లో పంపిణీ చేయనున్నారని తెలిపారు.
నాలుగు మండలాలకు సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నారన్నారు. రూ.20 లక్షలతో లెంకలగడ్డ గ్రామపంచాయతీ శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. పలిమెల మండలంలో రూ.20 లక్షలతో నిర్మించిన పలిమెల గ్రామపంచాయతీ ప్రారంభోత్సవం, రూ. 31లక్షలతో నిర్మించిన మండల్ రిసోర్స్ సెంటర్ ప్రారంభోత్సవం, రూ. 32 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రూ.1 కోటి 50 లక్షలతో నూతనంగా మంజూరైన మండల పరిషత్ కార్యాలయానికి శంకుస్థాపన, రూ.20 లక్షలతో మంజూరైన దమ్మురు గ్రామపంచాయతీ శంకుస్థాపన చేయనున్నట్లుగా వివరించారు.



