Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుచిన్న దేవాలయాల అభివృద్ధిపై మంత్రి సురేఖ సమీక్ష

చిన్న దేవాలయాల అభివృద్ధిపై మంత్రి సురేఖ సమీక్ష

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న దేవాలయాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో దేవాదాయ శాఖ రాష్ట్ర స్థాయి సీజీఎఫ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఇందులో చిన్న దేవాలయాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులపై మంత్రి సురేఖకు అధికారులు వివరిస్తున్నారు.

Minister Surekha reviews the development of small temples
Minister Surekha reviews the development of small temples

బడ్జెట్ అనుమతులు, సీజీఎఫ్ నిధుల కోసం వచ్చిన విజ్ఞప్తుల మీద అధికారులతో మంత్రి సమగ్రంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ డరెక్టర్ వెంకట్ రావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఇతర ఉన్నతాధికారులు, ఈఓలు, సీజీఎఫ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad