Monday, April 13, 2026
E-PAPER
Homeఖమ్మంమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండల పర్యటన

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండల పర్యటన

- Advertisement -

– గిరిజనుల సమస్యలపై దృష్టి
– పొజీషన్ లో ఉంటే చాలు రాయితీలు ఇవ్వండి
నవతెలంగాణ – అశ్వారావుపేట 

అశ్వారావుపేట మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం పర్యటించారు. మొద్దులమడ గ్రామంలో జరిగిన శుభకార్యానికి హాజరైన అనంతరం, గ్రామంలోని సమస్యలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు 2000 సంవత్సరంలో ఆయన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన చెరువు ప్రస్తుతం నిరుపయోగంగా మారిందని, దానిని మరమ్మత్తులు చేసి పునరుద్ధరించాలని విన్నవించారు.

అదే విధంగా 76 సర్వే నంబర్‌లో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం అందించే పథకాల లబ్ధి పొందలేకపోతున్నామని గిరిజనులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన మంత్రి.. సాగులో ఉన్న గిరిజనులకు పామ్ ఆయిల్ మొక్కలు అందించి,రాయితీలతో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి మౌలిక వసతులు కీలకమని పేర్కొన్న ఆయన, గతంలో ఈ ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి సదుపాయం, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఈ ప్రాంతంలో జామాయిల్ సాగు ఎక్కువగా జరుగుతోందని, రైతులు పామ్ ఆయిల్ సాగు వైపు మొగ్గు చూపితే మంచి లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, ఐటీడీఏ పీవో బీ. రాహుల్, తహశీల్దార్ దాసరి కిశోర్, పైడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -