Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు జిల్లాకు మంత్రులు రాక..

రేపు జిల్లాకు మంత్రులు రాక..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు మండల కేంద్రాల్లో అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముగ్గురు మంత్రులు రానున్నారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ సంక్షేమ శాఖ(ఉమ్మడి జిల్లా ఇన్చార్జి)  మంత్రి అడ్లూరి లక్ష్మణ్  రానున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా 3.45 గంటలకు పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ నందు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తారనీ, తదుపరి 5.00 గంటలకు ఆలేరు మండల కేంద్రంలోని దినేష్ గార్డెన్స్ లో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1.00 గంటలకు జిల్లా కలెక్టరేట్  కార్యాలయం నుండి పోచంపల్లి ప్రోగ్రాం కు బస్సు ఏర్పాటు  ఏర్పాటు చేసినట్లు డిపిఆర్ఓ కార్యాలయం ప్రకటించింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -