Tuesday, March 10, 2026
E-PAPER
Homeసినిమాసరికొత్త కథతో 'మిరాకిల్‌'

సరికొత్త కథతో ‘మిరాకిల్‌’

- Advertisement -

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ పై రమేష్‌ ఎగ్గిడి – శ్రీకాంత్‌ మొగదాసు – చందర్‌ గౌడ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం ‘మిరాకిల్‌’.
హెబ్బా పటేల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్‌ హీరోలు సురేష్‌, శ్రీరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రణధీర్‌ బీసు హీరో.
‘సత్య గ్యాంగ్‌, ఫైటర్‌ శివ’ చిత్రాల దర్శకుడు ప్రభాస్‌ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్‌ హైదరాబాద్‌ పరిసర గ్రామమైన కొండమడుగులో పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు, యూనిట్‌ సభ్యులందరి సమక్షంలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది చిత్రబందం. తన కెరీర్‌ బెస్ట్‌ ఫిల్మ్‌గా ‘మిరాకిల్‌’ నిలిచిపోతుందని ప్రకటించడం ద్వారా ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది హీరోయిన్‌ హెబ్బా పటేల్‌. సీనియర్‌ హీరో శ్రీరామ్‌ మాట్లాడుతూ, ‘ఇటువంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద హిట్‌ చేస్తారు. దర్శకుడిగా ప్రభాస్‌ నిమ్మలకు ఉజ్వల భవిష్యత్‌ ఉంది’ అని తెలిపారు.
‘ఇప్పటివరకు మన ఇండియన్‌ స్క్రీన్‌ పై రాని సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది’ అని దర్శకుడు ప్రభాస్‌ నిమ్మల అన్నారు.
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ. ‘ఈ మూడో షెడ్యూల్‌తో దాదాపు 90 శాతం షూటింగ్‌ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్‌ త్వరలో ప్లాన్‌ చేస్తాం. సరికొత్త కథతో ఈ చిత్రాన్ని మాదర్శకుడు తెరకెక్కిస్తున్నారు’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -