Thursday, October 23, 2025
E-PAPER
Homeసినిమాపాన్‌ వరల్డ్‌ ఫ్రాంచైజ్‌గా 'మిరాయ్‌'

పాన్‌ వరల్డ్‌ ఫ్రాంచైజ్‌గా ‘మిరాయ్‌’

- Advertisement -

హీరో తేజ సజ్జా నటించిన చిత్రం ‘మిరాయ్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 12న రిలీజై, బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సందర్భంగా మేకర్స్‌ బ్రహ్మాండ్‌ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్‌ మీట్‌ నిర్వహించారు. ఈ వేడుకలో యూనిట్‌ అందరికీ మెమెంటోలు అందించి అభినందించారు. హీరో తేజ సజ్జ మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి మేము చాలా ఈవెంట్లు చేశాము. ఈ ఈవెంట్‌ మాత్రం మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించిన టెక్నీషియన్స్‌ అందరికోసం. వాళ్లకి గుర్తుగా ఉండాలని ఈవెంట్‌ని నిర్వహించాం. ఇలాంటి ఈవెంట్‌ని పెట్టడానికి ముందడుగు వేసిన మా నిర్మాత విశ్వప్రసాద్‌కి కృతజ్ఞతలు.

సినిమా రిలీజై, దాదాపుగా 45 డేస్‌ అవుతుంది. ఒటీటీకి వచ్చే వరకూ కూడా థియేటర్లో రన్‌ అయ్యింది. ఓటీటీలోకి వచ్చాక కూడా ఈవెంట్‌ని పెట్టడం విశ్వ గొప్ప మనసు. ఇంత బ్రహ్మాండ్‌ బ్లాక్‌ బాస్టర్‌ లాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్‌ కార్తీక్‌కి థ్యాంక్యూ’ అని అన్నారు. ‘ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. దీనిని పాన్‌ వరల్డ్‌ ఫ్రాంచైజ్‌ చేస్తున్నాం. జియో స్టార్‌ లార్జెస్ట్‌ యూజర్‌ బేస్‌ ఉన్న ఓటీటీ. తెలుగు సినిమాల్లో ఇది అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన సినిమా అవుతుందని వారి నుంచి మాకు ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాం’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -