ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌

సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులను, ప్రభాస్‌ అభిమానులను వైజయంతీ మూవీస్‌ మరోసారి సర్‌ప్రైజ్‌ చేసింది.
మంగళ వారం దీపికాపదుకొనె లుక్‌ని రిలీజ్‌ చేసిన మేకర్స్‌ బుధవారం ప్రభాస్‌ లుక్‌ని విడుదల చేశారు. సెపియా టోన్డ్‌ క్యాప్టివేటింగ్‌ ఇమేజ్‌లో ప్రభాస్‌ పవర్‌ ఫుల్‌ ఫస్ట్‌ లుక్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. అద్భుతంగా రూపొందించిన ఫస్ట్‌ లుక్‌ విజువల్‌ ఈ చిత్ర అత్యద్భుత నిర్మాణ విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది.
‘ప్రాజెక్ట్‌ కె’ శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌లోని ప్రతిష్టాత్మకమైన హెచ్‌ హాల్‌లో లాంచ్‌ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మహత్తరమైన ఈవెంట్‌లో క్రియేటర్‌లు సినిమా టైటిల్‌, టీజర్‌ను రివీల్‌ చేయ బోతున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి హేమా హేమీలు నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

Spread the love