రోడ్డుపై వృథాగా పోతున్న నీరు
నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలంలోని మిర్దపల్లి రోడ్డులో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్‌కు లీకేజ్ ఏర్పడింది. అనేక రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో విలువైన తాగునీరు వృథాగా పోతుంది. పైప్‌లైన్ లీక్ కారణంగా నీరు రోడ్డుమీద ప్రవహిస్తూ బురదమయంగా మారింది. దీంతో ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనాలు స్కిడ్ అవుతున్నాయి.
ఈ పరిస్థితి స్థానికులు, ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. ఇకపోతే, మిషన్ భగీరథ నీరు గత కొన్ని రోజులుగా చేరడంతో రోడ్డుపై చిన్నపాటి కుంటలను తలపించేలా నీరు నిల్వవుతోంది. దీని వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. స్థానికులు పలుమార్లు గ్రిడ్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడం గమనార్హం. మెయిన్ పైప్‌లైన్ లీక్ కారణంగా నీరు పొలాల్లోకి చేరి పంటలకు నష్టం కలుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లీకేజీని తక్షణమే సరిచేయాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.



