Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాసిరకం పనులతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం

నాసిరకం పనులతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం

- Advertisement -

కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీధర్
నవతెలంగాణ – కాటారం

నాసిరకం పనులతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, నాసిరకం రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆత్కూరి శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాటారం నుండి మహాముత్తారం మీదుగా పెగడపల్లి వరకు సదరు కాంట్రాక్టర్ రూ.16 కోట్లతో చేపడుతున్న రోడ్డు పనులలో నాణ్యత లోపించి పనులు చేపట్టిన ఐదు రోజులకే రోడ్డు పగుళ్లు తేలడం, పలుచోట్ల కుంగిపోవడం జరిగిందని ఆరోపించారు.

ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే కనీసం పట్టించుకునే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై మండిపడ్డారు. రోడ్డు పనులు ప్రారంభమైన అప్పటినుండి ఇప్పటివరకు అధికారులు మాత్రం పరిశీలించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు పనులను పరిశీలించి, నాసిరకం పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ లైసెన్సును రద్దు చేయాలని, మళ్లీ రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -