Tuesday, July 8, 2025
E-PAPER
Homeకరీంనగర్జర్నలిస్ట్ ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యే పరమార్శ

జర్నలిస్ట్ ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యే పరమార్శ

- Advertisement -

నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ ఆకస్మిక మరణం చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా రూ.20000 ఆర్థిక సహాయం అందించారు. కలెక్టర్ తో మాట్లాడి కలెక్టర్ స్పెషల్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ రూ.50,000 అందిస్తామని హామీ ఇచ్చారు.

వారం రోజుల్లో డబల్ బెడ్ రూమ్ ప్రొసీడింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు కోరాయి. దీనిపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందిస్తూ.. ప్రభుత్వ విప్ శ్రీనివాస్ తో మాట్లాడి.. డబల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రసాద్ కుటుంబానికి అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆయనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్ సంగీతం శ్రీనాథ్, ఆకునూరి బాలరాజు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -