- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా సీఎం కప్పులో భాగంగా గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులను శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. హ్యాండ్ బాల్ లో ఏం చంటి, బి దేవేందర్, వాలీబాల్ లో ఎస్ చరణ్ ముగ్గురు క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల పట్ల ఆసక్తి కనపర్చాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, డి ఈ ఓ, గిరిజన గురుకుల కళాశాల బాలురు కాటారం భూపాలపల్లి డి సి ఓ, ప్రిన్సిపాల్ హెచ్ రాజేందర్, పిడి మహేందర్, పి ఈ టి శ్రీనివాస్ కోచ్ వెంకటేష్ లు పాల్గొన్నారు.
- Advertisement -