సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

– బస్తీ దవాఖాన డాక్టర్ కుతేజా ఫాతిమా 

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు గా ఉండాలని చంద్ర కిరణ్ బస్తి లోనీ బస్తీ దవాఖాన డాక్టర్ కుతేజా ఫాతిమా అన్నారు. మంగళవారం చంద్ర కిరణ్ బస్తీలోని బస్తీ దావాఖానాలో ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం అయినందున ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త లు పాటించాలని సూచించారు. వేడి కాచి వడబోసిన నీరును తీసుకోవాలని సూచించారు ఇంట్లో, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు వేడి ఆహారం, కూరగాయలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకో వాలన్నారు. చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. జలుబు. జ్వరం ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని కోరారు.తమ బస్తీ దవాఖానా లో బీపీ, షుగర్ వ్యాధులకు మందులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ ఎం అనురాధ. సపోర్టింగ్ స్టాప్ పి అశోక్ తదితరులు పాల్గొన్నారు
Spread the love