అర్హులకు ఇవ్వటం వల్ల పురస్కారాలకు గౌరవం

నవతెలంగాణ – హైదరాబాద్: పెద్దల పేరిట ఇచ్చే పురస్కారాలు అర్హులైన వారికి బహుకరిచటం వల్ల ఆ అవార్డ్ కు గౌరవం కలుగుతుందని సి.బి.ఐ. విశ్రాంత జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్ టీ.ఆర్ పేరిట అవార్డ్ కు తనికెళ్ళ భరణి ని ఎన్నుకోవటం సముచితం ఉందని అభినందించారు. వంశీ ఇంటర్నేషనల్ శుభాకాంక్షలతో శారదా మ్యూజిక్ అకాడమీ నిర్వ్యహణ లో విఖ్యాత నటుడు ఎన్ టీ.ఆర్ శత జయంతి సందర్భం గా నట దర్శక రచయిత తనికెళ్ళ భరణి కి ఎన్. టీ.ఆర్ పురస్కారం ప్రదానోత్సవం జఠిగింది.ముఖ్య అతిధిగా లక్ష్మీ నారాయణ పాల్గొని పురస్కారం బహుకరించి మాట్లాడారు. ఎన్. టీ.ఆర్ రాజకీయ రంగం లోను సినీ రంగం లో ధీరోదత్త నాయకుడు అన్నారు. భరణి ఎన్ టీ.ఆర్ వలెనే బహు ముఖీన ప్రతిభావంతులని అన్నారు అధ్యక్షత వహించిన దర్శకుడు రేలంగి నరసింహ రావు మాట్లాడుతూ ఎన్. టీ.ఆర్ పట్టుదల పనిపట్ల అంకిత భావం వివ రించారు. వంశీ రామ రాజు నిర్వ్యహణ లో జఠిగిన కిర్యక్రమం లో గాయకుడు త్రినాథరావు, దైవఙ్గ శర్మ నిర్మాత చౌదరి తదితరులు పాల్గొన్నా రు. శారద, రేణుక,పవన్,ఫణి తదితరులు మధురంగా పాటలు అలపించారు

Spread the love