నవతెలంగాణ-సారంగాపూర్
మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్ పై లైట్ల పునరుద్ధరణ పనులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంబించి మాట్లాడారు. లైట్ల ఏర్పాటుతో ప్రాజెక్ట్ పై రాత్రివేళ ఇబ్బందులు ఉండవు వర్షాకాలంలో నీటి మట్టం ఇన్ఫ్లో ను గుర్తించి అవసరమైనపుడు నీటిని దిగువకు విడుదల చేయడానికి అనువు గా ఉండేందుకురూ. 32.70 లక్షలతో లైట్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అనంతరం ప్రాజెక్ట్ లో నీటి ఇన్ఫ్ల్, ఔట్ ఫ్లో తదితర అంశాలపై నీటి పారుదల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా,మండల బీజేపీ నాయకులు సత్య నయాయణ గౌడ్, వడ్డే రాజేందర్ రెడ్డి,గంగారెడ్డి,రామ్ శంకర్ రెడ్డి, బీజేపీ మండల అద్యక్షులు కాల్వ నరేష్ ,చెన్న రాజేశ్వర్ ,శ్రావణ్ కుమార్, సాహెబ్ రావు, పతాని నర్సయ్య,బడి పోతన్న,సామల వీరయ్య, గణపతి,చిన్నయ్య, మదు,భోజాన్న, రజిత్,విజయ్,లక్ష్మన్, ఉప తహశీల్దార్ రవీందర్, నీటిపారుదల అధికారులు, కార్యకర్తలు రైతులు, పాల్గొన్నారు.