నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంగళవారం స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బీటీ రోడ్డు విస్తరణ పనులను పురోగతిని పరిశీలించారు. అదేవిధంగా రూర్బన్ పథకంలో లక్షలాది రూపాయలు వెచ్చించి దోస్త్ పల్లి గ్రామావికీ వెళ్లే రోడ్డు వద్ద నిర్మించిన ఆడిటోరియం గత మూడు సంవత్సరాలుగా మూసి ఉంది. అయితే స్థానికులతో కలిసి ఆడిటోరియంను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల కేంద్రంలో కొన్ని శాఖలకు సంబంధించిన నిర్మాణాలు చేసినప్పటికీ, అవి ఉపయోగంలో లేవని, అందుకే వాటిని పరిశీలించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు లాడేగాం సతీష్ పటేల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొంపెల్లి రాజులు , సాయ గౌడ్, శివానంద్, రమేష్ దేశాయ్ , మనోహర్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మేల్యే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES