నవతెలంగాణ – తిమ్మాజిపేట
తిమ్మాజిపేట మండల కేంద్రంలో జోహి హోమియో క్లినిక్ ను నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే డా.కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. మండలంలోని గుమ్మకొండ గ్రామానికి చెందిన డాక్టర్ హిమబిందు జాన్ దంపతులు మండల కేంద్రంలో నూతనంగా జోహి హోమియో క్లినిక్ ను ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ హిమబిందు జాన్ దంపతులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకు ఆస్పత్రి మేనేజ్మెంట్ పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి నాయకులు మల్లయ్య గౌడ్, వివేక్ రెడ్డి, దానం బాలరాజ్, భాస్కర్ రెడ్డి, రవీందర రెడ్డి, ముబారక్, నాగసాయిలు, మాధవులు, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.