Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి ఔటర్ రింగు రోడ్డు కోసం కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

కామారెడ్డి ఔటర్ రింగు రోడ్డు కోసం కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కే వెంకట రమణారెడ్డి  కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకటన విడుదల చేస్తూ, కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరినట్లు తెలిపారు. గతంలో  సుమారు రూ.550 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవుతో కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం ప్రతిపాదనపై కేంద్ర మంత్రిని కలిసి స్థల పరిశీలన, వ్యయ ప్రణాళికలు రూపొందించాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

సీఆర్‌ఐఎఫ్ (Central Road Infrastructure Fund) కింద నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి, పొడిగింపుతో పాటు కొత్త రహదారుల ఏర్పాటుకు లింగపూర్ నుంచి టెక్రియల్ వరకు 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ అంశాలపై మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించి రింగు రోడ్డు పనుల ప్రణాళిక వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించినట్లు, అలాగే 50 కోట్ల నిధుల కేటాయింపుపై కూడా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -