Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్వతాధిరోహణ చేసేందుకు బానోతు వెన్నెలకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే 

పర్వతాధిరోహణ చేసేందుకు బానోతు వెన్నెలకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కియాఘర్ పర్వతాధిరోహణ చేసేందుకు వెళ్తున్న బానోత్ వెన్నెలకు గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో 5 లక్షల 50 వేల రూపాయల సహాయన్నీ కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అందించడం జరిగిందని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్ తెలిపారు. మాచారెడ్డి మండలం సోమారిపేట గ్రామానికి చెందిన బానోత్ వెన్నెల కియాఘర్ పర్వతాన్ని ఆదిరోహించడానికి వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానం చేసి బీజేపీ నాయకులు వీడ్కోలు పలికారు అన్నారు. ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ మొదట తాను ఈ రంగంలో అడిగినప్పుడు  గతంలో ఎమ్మెల్యేగా  గెలవక ముందు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారని, తర్వాత దక్షణ ఆఫ్రికా దేశంలోని టాంజానియా లోని  5847 మీటర్ల ఎత్తు గల కిలిమంజారో నీ అధిరోహించడం జరిగిందనీ, ప్రస్తుతం హిమాలయాలను అధిరోహించే క్రమంలో శిక్షణలో భాగంగా ప్రస్తుతం లే లగ్ధాక్ లో ఉన్న 6100 మీటర్ల ఎత్తైన కియాఘర్ పర్వతాన్ని అధిరోహించేందుకు ఈ నెల 28 న లే లడ్డక్ నుండి ప్రారంభించనున్న సందర్భంగా కామారెడ్డి నుండి ప్రారంభం అయి కామారెడ్డి కి చేరుకునే వరకు అయ్యే ఖర్చు సుమారు 5 లక్షల 50 రూపాయలు తన చిన్ననాటి మిత్రులు అయినటువంటి డాక్టర్ విజయ్, ఆనంద్, డాక్టర్, దినేష్ రెడ్డి, డాక్టర్, రవీందర్ రెడ్డి,  వ్యాపారవేత్త గబ్బుల శేఖర్, కామారెడ్డి శాసన సభ్యులు  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి లు అందరూ కలిసి ఇవ్వడం జరిగిందనీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అనంతరం

బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విపుల్ జైన్ మాట్లాడుతూ పర్వతాధిరోహణ కు బానోత్ వెన్నెల అడిగిన వెంటనే తన స్నేహితులతో కలిసి పోగుచేసిన డబ్బులు 5 లక్షల 50 వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా అన్ని రకాల సౌకర్యాల కల్పనలు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి  కృషి చేశారని,  ఈ రకంగా కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన యువత క్రీడలు, చదువులు, ఇతర రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారికి తన వంతుగా సహాయ సహకారాలు అందించడంలో కాటిపల్లి వెంకట రమణ రెడ్డి  ముందుంటారని అన్నారు. ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ కామారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో ముధంజలో ఉండాలన్నదే కె వి ఆర్ కళ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -