విద్యార్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
బాన్సువాడ మండలం బొర్లం గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థిని సంగీత మృతిపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇలాంటి పునవృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం బాన్సువాడ ఎమ్మెల్యే అతిథి భవనం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివారం బాన్సువాడ మండలం బోర్లం గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంగీత మృతి చెందడంతో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
విద్యార్థి సంగీత స్వస్థలం మద్నూర్ మండలం కుడిచేర్ల గ్రామానికి చెందిన సంగీత గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తన ఇంట్లో బాన్సువాడలో ఓ శుభ కార్యక్రమం కొరకు గురుకుల పాఠశాలకు చెందిన కొంత ఫర్నిచర్ ను ఆటోలో తీసుకెళ్లి కార్యక్రమం ముగించిన అనంతరం ఆటోలో తిరిగి వస్తువులను గురుకుల పాఠశాలకు తీసుక రావడంతో ఆటోలో వచ్చిన ఫర్నిచర్ ను విద్యార్థుల చేత దించుతుండగా ఆటో డ్రైవర్ బాలికను చూడకుండా జాగ్రత్తగా అటు తొలడంతో విద్యార్థిని ఆటో నుంచి కిందపడి తీవ్ర గాయాలు కావడంతో బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి, రాష్ట్ర ఆగ్రో సంస్థ అధ్యక్షుడు కాసుల బాలరాజ్ లు బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే నేడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ విషయం ఎమ్మెల్యే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా మృతి చెందిన బాలిక కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమాచారం అందించారు, త్వరలోనే ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని వారి కుటుంబానికి చెల్లిస్తామని ఈ సందర్భంగా పోచారం తెలిపారు. వీరి వెంట అధికారులు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.



