Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంలా ప్రవేశ పరీక్షకు హాజరైన ఎమ్మెల్యే జారే

లా ప్రవేశ పరీక్షకు హాజరైన ఎమ్మెల్యే జారే

- Advertisement -
  • – సామాన్యులకు న్యాయ సేవే లక్ష్యం
    నవతెలంగాణ – అశ్వారావుపేట
  • సామాన్యులకు న్యాయ సేవే లక్ష్యంగా లా కోర్స్ చదవాలని నిర్ణయించుకున్నానని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన హైద్రాబాద్ లోని మౌళాలీ లా కళాశాలలో లాసెట్ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష పూర్తి అయిన అనంతరం ఆయన నవతెలంగాణ తో మాట్లాడారు. ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసానని తెలిపారు. న్యాయ విద్య నాకు చిన్ననాటి నుంచీ ఇష్టం అన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు న్యాయపరంగా సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నా నన్నారు. ఎమ్మెల్యేగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడటమే  కాకుండా న్యాయ రంగంలోకి ప్రవేశించి మరింత సేవ చేయాలన్న అభిలాష తో ఈ పరీక్ష రాసినట్టు తెలిపారు. సాధారణ ప్రజలకు అండగా నిలబడటమే నా బాధ్యత అని స్పష్టం చేశారు. న్యాయ విద్య ద్వారా మరింత అవగాహన పెంచుకుని ప్రజలకు మంచి చేయాలన్న మంచి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళడం యువతకు ప్రేరణగా నిలుస్తుంది.ప్రజా ప్రతినిధిగా ఉన్నత విలువలతో నేటి యువతకు మార్గ దర్శకుడి గా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిలవడం గర్వకారణం.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img