- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివాజీ రాథోడ్ కుటుంబానికి చెందిన పెండ్లికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హాజరై వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రామ్ పటేల్, శ్రీనివాస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, హనుమాన్లు స్వామి, యువ నాయకులు బండి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ రాథోడ్ ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
- Advertisement -