Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలతో మమేకమవుతున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

ప్రజలతో మమేకమవుతున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే తోటల శ్రీకాంత్ రావు ప్రజలతో మమేకమవుతున్నారు. ఎప్పుడు నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి ఉండడమే తన దేయమని, ప్రజా సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయమని పలుమార్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందులో భాగంగా బుధవారం నాడు జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గంలోని ప్రజలతో వారి సమస్యలను రాతపూర్వకంగా తీసుకొని , పరిష్కరించే విధంగా తనవంతుగా కృషి చేశారు. ప్రజా సమస్యలను తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను  వెంటనే సంబంధిత అధికారుల శాఖల అధికారులతో  మాట్లాడి ఎక్కడి సమస్యలు అక్కడే సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేశారు. సమస్యలుంటే నేరుగా తమకు వచ్చి తెలియజేయాలని వెంటనే తన వద్దనుండే ఫోన్ ద్వారా మాట్లాడడం జరుగుతుందని , సమస్యను వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు నియోజకవర్గంలోని 8 మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు , ప్రజా ప్రతినిధులు , లబ్ధిదారులు , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -