నవతెలంగాణ – మద్నూర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మద్నూర్ మార్కెట్ పరిధిలోని ప్రయివేట్ పత్తి మిల్లు కృష్ణ ఫైబర్ ఇండస్ట్రీస్ లో మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ ను పత్తి పంట రైతులు వినియోగించుకొని, పత్తి క్వింటాలుకు రూ.8110లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పత్తి పంట తేమ ఎనిమిది శాతం నుండి 12% లోపు ఉండాలని, రైతులు తమ పత్తిని తేమ లేకుండా తీసుకువస్తే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. తేమశాతం హెచ్చుతగ్గులు ఉంటే ధరలో కూడా కొంత మార్పులు ఉంటాయని వారు తెలిపారు. అనంతరం సీసీఐ అధికారి మాట్లాడుతూ.. రైతులకు నిబంధనల ప్రకారం పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మద్నూర్ మార్కెట్ కమిటీ ఇన్చార్జి సెక్రెటరీ రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ అధికారులు, ప్రయివేట్ కొనుగోళ్ల పత్తి వ్యాపారులు పత్తి రైతులు పాల్గొన్నారు.
సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్ళను ప్రారంభించిన ఎమ్మెల్యే తోటా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



