నవతెలంగాణ- మద్నూర్
డోంగ్లి మండలంలోని పలు గ్రామాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు శనివారం విస్తృతంగా పర్యటించారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. డోంగ్లీ మండల కేంద్రం తో సహా సిర్పూర్, పెద్ద టాక్లి, చిన్న టాక్లి, లింబూర్, ఇలేగావ్, మొఘ, గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా నిరంతర కృషి చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాల్లో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశాయి, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




