Friday, December 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంతోష్ మేస్త్రీ  నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

సంతోష్ మేస్త్రీ  నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఉష సంతోష్ మేస్త్రీ తమ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోసంతోష్ మేస్త్రీ ఇంటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్నూర్ గ్రామ ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మద్నూర్ జనమంతా ఉష సంతోష్ మేస్త్రీ కి మద్దతుగా కదిలి వచ్చింది.ఈ నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపించింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  మాట్లాడుతూ.ఉష సంతోష్ మేస్త్రీ  అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మద్నూర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సౌమ్యులు, అందరితో కలిసిపోయే ఉష సంతోష్ మేస్త్రీ  సేవాభావంతో మద్నూర్ గ్రామ అభివృద్ధికై ముందుకు వచ్చారని అన్నారు. ఉష సంతోష్ మేస్త్రీ నీ  ఆశీర్వదిస్తే మద్నూర్ ను ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని.. వారికి ఎల్లప్పుడూ సహకరిస్తూ గ్రామ అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే  తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,  ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో  పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -