Monday, January 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట

కౌలాస్ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కౌలాస్ కోట మీద జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. భారత రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలను గుర్తుచేశారు. దేశ అభివృద్ధి, సమైక్యత, శాంతి కోసం ప్రతి పౌరుడు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమాలను ఉత్సాహంగా వీక్షించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు చిన్నారులను అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు.. గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజల్లో జాతీయ భావాన్ని మరింత బలపరిచాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -