Tuesday, December 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ అభ్యర్థి ఇంటికి వచ్చి కలిసిన ఎమ్మెల్యే తోట

కాంగ్రెస్ అభ్యర్థి ఇంటికి వచ్చి కలిసిన ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పాండురంగ పాటిల్ ను ఆయన ఇంటికి వెళ్ళి మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కలిశారు. ఈ క్రమంలో ఆయన సర్పచ్ అభ్యర్థి, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం అహర్నిశలు కష్టపడాలని స్థానిక నాయకులకు దిశానిర్ధేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ గా గెలవాలని పాండురంగ పాటిల్ కు సూచించారు. అనంతరం పాటిల్ మాట్లాడుతూ.. సాబ్ తుమ్ హమారా గరుకు ఆయే బహుత్ ఆనంద్ హై అంటూ ఆనందం వ్యక్తం చేశారు. జీత్ కేలియే పూర కోసిస్ కర్తహు మై జరూర్ విజయ్ హోతావు ఏఈ కామ్ కరో జితాహో అంటూ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పాండురంగ పాటిల్ ను అభయం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, పాటిల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -